స్టార్ హీరోయిన్లను ఆకర్షిస్తున్న వెబ్ సిరీస్ కథలు

స్టార్ హీరోయిన్లను ఆకర్షిస్తున్న వెబ్ సిరీస్ కథలు

Published on Nov 29, 2019 3:51 PM IST

Tamannah

డిజిటల్ స్ట్రీమింగ్ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా ఆ వైపు దృష్టి పెడుతున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే వెబ్ సిరీస్ కథలను కూడా వింటూ, నచ్చిత వెంటనే సైన్ చేసేస్తున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్ చేస్తుండగా ఈమధ్యే సమంత అక్కినేని ఈమధ్యే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘థ ఫ్యామిలీ మాన్’ యొక్క రెండవ సీజన్లో నటిసస్తోంది.

ఇప్పుడు వీరి బాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడుగులు వేస్తోంది. ఇటీవలే ఆమె తమిళంలో ఒక వెబ్ సిరీస్ కథ పట్ల బాగా ఆకర్షితురాలైంది. ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే కథగా ఉంటుందట. ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ కథల్లో నటిస్తే పాత్రలో ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తమన్నా అంటోంది. ఈ వెబ్‌సిరీస్‌ను రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తానికి మన సౌత్ స్టార్ హీరోయిన్లు డిజిటల్ ఫ్లార్ ఫామ్ మీద కూడా తమ మార్క్ చూపడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు