మూడోసారి చేస్తున్నందుకు ఎగ్జైట్ అవుతున్న తమన్నా

Tamannah

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. నిన్నటి వరకు గోపిచంద్ కొత్త చిత్రంలో తమన్నాను తీసుకోవాలనే యోచనలో చర్చలు జరిపిన నిర్మాతలు ఎట్టకేలకు ఆమెనే ఫైనల్ చేసుకున్నారు. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని సంపత్ నంది డైరెక్ట్ చేయనున్నాడు.

తమన్నా, సంపత్ నంది కలిసి వర్క్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో సంపత్ డైరెక్ట్ చేసిన ‘రచ్చ, బెంగాల్ టైగర్’ లాంటి చిత్రాల్లో తమన్నా కథానాయకిగా నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయన డైరెక్షన్లో నటించనుంది. ఈ విషయాన్నే చెబుతూ సినిమా పట్ల చాలా ఎగ్జైటింగా ఉన్నానని, సంపత్ నందితో చేసిన గత రెండు చిత్రాల్లానే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

Exit mobile version