లవ్, పెళ్ళికి టైం లేదంటున్న తమన్నా

లవ్, పెళ్ళికి టైం లేదంటున్న తమన్నా

Published on Apr 20, 2014 3:15 PM IST

tamanna
సౌత్ ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉన్న మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పుడు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది.

తాజాగా మీడియా వారు తమన్నాని ప్రేమ, పెళ్లి గురించి అడిగితే ‘ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను. ప్రేమ లేదా పెళ్ళికి నా దగ్గర సమయం లేదని’ సమాధానం ఇచ్చింది.

అలాగే మాట్లాడుతూ ‘ఎప్పుడూ వయసు అనేది పెళ్ళికి పునాది కాకూడదు. ఎప్పుడైతే ఒక రిలేషన్ ద్వారా పెళ్లి అనే దాని దారి తీస్తుందో అప్పుడే పెళ్లి జరుగుతుందని’ చెప్పింది. తమన్నా చెప్పిన మాటలు ఇప్పటి యువతని ఎంత వరకూ ఆలోజింపజేస్తాయో, అలాగే వయసు రాగానే పెళ్లి చేసెయ్యాలి అనుకునే పెద్దవారు ఈ మాటల్ని ఎలా తీసుకుంటారో చూడాలి.

ప్రస్తుతం తమన్నా తెలుగులో మహేష్ బాబు సరసన ‘ఆగడు’ సినిమాలో నటిస్తోంది. అది కాకుండా వివి వినాయక్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

తాజా వార్తలు