ఆ విషయంలో భేష్ అనిపిస్తున్న తమన్నా..!

ఆ విషయంలో భేష్ అనిపిస్తున్న తమన్నా..!

Published on Apr 23, 2020 8:06 PM IST

Tamannaah1

మిల్కీ బ్యూటీ తమన్నా మరో మారు తన పెద్ద మనసు చాటుకుంది. ఇటీవల సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) నిధికి 3 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చిన ఈమె, ఒక అడుగు ముందుకు వేసి, ముంబైకి చెందిన లెట్స్ ఆల్ హెల్ప్ అనే ఎన్జీఓతో చేతులు కలిపి ముంబైలోని దాదాపు 10,000 మంది వలస కార్మికులు మరియు మురికివాడలకు చెందిన ప్రజలకు 50 టన్నుల ఆహార పదార్దాలు, మందులు మరియు రోజువారీ నిత్యావసరాలను అందించనుంది. ఈ కష్ట సమయాల్లో వేలాది మంది నిరాశ్రయులకు మరియు పేదలకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తమన్నా కోరారు.

ప్రస్తుతం తమన్నా తెలుగులో గోపించంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో జ్వాలా రెడ్డి అనే లేడీ కబడ్డీ కోచ్ గా ఆమె నటిస్తుంది. తమిళ మరియు హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

తాజా వార్తలు