ఐపిఎల్ ఓపెనింగ్ ఈవెంట్లో ఆడిపాడనున్న తమన్నా !

భారతీయ క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపిఎల్ ఇంకో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ సందర్బంగా నిర్వాహకులు భారీ స్థాయిలో ఓపెనింగ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్లో వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, హృతిక్ రోషన్, పరిణీతి చోప్ర వంటి స్టార్లు పెర్ఫార్మ్ చేయనుండగా సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా కూడ వాటితో పాటే వేదికను పంచుకోనుంది. ఈ వేడుకలో తమన్నా ప్రత్యేకమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుందట. ఇందు కోసం ఆమెకు భారీగానే పారితోషకం అందినట్టు సమాచారం.