ఆ లెజెండరీ హీరోయిన్ పై తమన్నా బయోపిక్.?


ఇండియన్ సినిమాలో బయోపిక్స్ ఎంతటి ఆదరణ లభిస్తుందో తెలిసిందే. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్రముఖల పైన తీస్తే వాటికి మరింత స్థాయి ఆదరణను సినీ ప్రేమికులు అందిస్తున్నారు. అలా కీర్తి సురేష్ హీరోయిన్ గా లెజెండరీ నటి మహానటి సావిత్రి గారిపై తీసిన “సావిత్రి” సినిమాకు ఎంత పెద్ద హిట్టయ్యిందో చూసాము.

ఇప్పుడు మన టాలీవుడ్ కు చెందిన మరో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ లెజెండరీ హీరోయిన్ పై బయోపిక్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు సీనియర్ నటి జమున గారు. ఆమెపై శివనాగు నర్రా దర్శకత్వంలో తమన్నాతో మెయిన్ లీడ్ లో పెట్టి తీయనున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతానికి అయితే ఆమెను సంప్రదించి చర్చలు కొనసాగుతున్నాయట. ఇంకా తమన్నా ఓకే చేసిందో లేదో అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే తమన్నా గోపీచంద్ తో చేసిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”తో రెడీగా ఉంది. ఈ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version