‘ఆగడు’ లో మాస్ రోల్ చేయనున్న తమన్నా
Published on Nov 4, 2013 8:30 am IST

tamanna
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న ‘ఆగడు’ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తికరమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.

ఈ సినిమాలో తమన్నా పూర్తి మాస్ పాత్రలో కనిపించనుంది. శ్రీను వైట్ల మరో హిట్ కొట్టాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుండి స్క్రిప్ట్ ని చాలా పకడ్బందీగా తయారు చెస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook