మాస్ మహారాజ రవితేజ తన తర్వాతి చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం స్టార్ నటీనటుల్ని తీసుకుంటున్నారు. అది కూడా తమిళం నుండి కావడం విశేషం. ముందుగా తమిళ నటుడు సముద్రఖనిని సినిమాలోకి తీసుకున్న టీమ్ ఇప్పుడు డాషింగ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్‌ను కూడా తీసుకున్నారు. వరలక్ష్మి మొదటి నుండి మిగతా హీరోయిన్ల మాదిరిగా కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అలాంటి భిన్నమైన అభిరుచి కలిగిన నటి ఈ సినిమాకు సైన్ చెసింది అంటే ఇందులో కూడా కథ, ఆమె పాత్ర కూడా వైవిధ్యంగానే ఉండొచ్చు.
‘డాన్‌శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించనుంది. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
