తమిళ నిర్మాతలపై ‘లింగ’ డిస్ట్రిబ్యూటర్ల ఎదురుదాడి..

Lingaa_telugu-review-1
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ ఘోర పరాజయం పాలవడంతో డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు. 50% నష్టపోగా, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ 10% నష్టాన్ని మాత్రమే ఇస్తాననడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రజినీకాంత్, నిర్మాత వెంకటేష్ మరియు ‘లింగ’ విడుదలైన థియేటర్ల ముందు అడుక్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరి నిర్ణయాన్ని తమిళ చిత్ర నిర్మాతల మండలి వ్యతిరేకించింది. రజిని పరువును దిగజారుస్తున్నారు అని మండిపడింది. ఈ వ్యాఖ్యల పట్ల డిస్ట్రిబ్యూటర్లు స్పందించారు.

తమిళ చిత్ర నిర్మాతల మండలిలో రాక్ లైన్ వెంకటేష్ సభ్యుడు కాదు, మీరు అతనికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు. తమిళనాడులో సినిమా రంగం, రాజకీయాలు ఎప్పుడో విలీనం అయ్యాయి. ‘లింగ’ వివాదంలో రాజకీయ పార్టీల జోక్యం అనివార్యం. అని డిస్ట్రిబ్యూటర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగేలా కనబడడం లేదని చెన్నై మీడియా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలో డిస్ట్రిబ్యూటర్లు అడుక్కోవడానికి సిద్దం అవుతున్నారు.

Exit mobile version