‘సైరా’ నుండి మరో మోషన్ టీజర్ !

‘సైరా’ నుండి మరో మోషన్ టీజర్ !

Published on Jan 16, 2019 10:24 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు విజయ్ సేతుపతి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా, సైరా చిత్రబృందం సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ని రివీల్ చేస్తూ పోస్టర్ ను అండ్ మోషన్ టీజర్ ను విడుదల చేసింది. మోషన్ టీజర్ లో విజయ్ సేతుపతి కత్తి పట్టుకొని రౌద్రమైన్ లుక్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నారు.

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నయన తార, తమన్నా, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు