అఖిల్ కోసం తమిళ భామ ?

అఖిల్ కోసం తమిళ భామ ?

Published on Jul 7, 2019 4:24 PM IST

అఖిల్ అక్కినేని నాల్గవ సినిమా రెగ్యులర్ షూట్ ఈ నెలలోనే మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా ఫైనల్ చేయలేదు చిత్ర యూనిట్. మొదట ఇందులో రష్మిక మందన్న లేదా కైరా అద్వానీల్లో ఎవరో ఒకరు నటిస్తారనే టాక్ వినబడింది. కానీ అవేవీ నిజం కాదని తేలింది.

ఇప్పుడు తాజాగా తమిళ నటి నివేత పేతురాజ్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నివేత ‘చిత్రలహరి, బ్రోచేవారెవరురా’ సినిమాలతో మెప్పించింది. బన్నీ చేయనున్న నెస్ట్ రెండు సినిమాల్లో కూడా ఆమె నటించనుంది. మరి ఈ సినిమాకి కూడా ఆమెనే ఫైనల్ చేస్తారో లేకపోతే ఇంకెవరినైనా తీసుకుంటారో చూడాలి. ఇకపోతే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు