దేవరకొండ సినిమాకు సంగీతం అందివ్వనున్న తమిళ సంగీత దర్శకుడు !

తెలుగు హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయా చేస్తున్న సినిమాల్లో భరత్ కమ్మ చిత్రం కూడ ఒకటి. ‘పెళ్లి చూపులు’ నిర్మాత యాష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందివ్వనున్నారు.

ఇప్పటికే తెలుగులోకి అనిరుద్ రవిచంద్రన్, హిపాప్ తమిజా వంటి తమిళ సంగీత దర్శకులు ప్రవేశించగా ఇప్పుడు మరొక జస్టిన్ కూడ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. భరత్ కమ్మతో కలిసి ‘మరో ప్రపంచం’ అనే షార్ట్ ఫిల్మ్ కు పనిచేసిన జస్టిన్ ఆ స్నేహంతోనే ఈ సినిమా చేస్తున్నట్టు తెలిపారు. జస్టిన్ తమిళంలో ‘అదియే అజగె, పెసయుమ్ ఈసయ, వొనక్కగా పోరంతెనె’ వంటి సినిమాలకు సంగీతం అందించారు.

Exit mobile version