ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ తమిళ్ మిస్టరీ థ్రిల్లర్

ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ తమిళ్ మిస్టరీ థ్రిల్లర్

Published on Apr 20, 2024 1:31 AM IST

వైభవ్ హీరోగా ఇటీవల షరీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ రణం అరమ్ తవరేల్. నందిత శ్వేతా, తాన్యా హోప్ కీలక పాత్రల్లో నటించిన ఈమూవీకి అర్రోల్ కోరేలి సంగీతం అందించారు.

రిలీజ్ అనంతరం థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. తమిళ వర్షన్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీ అందుబాటులో ఉంది.

మిథున్ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ పై రణం అరమ్ తవరేల్ మూవీని మధు నాగరాజన్ గ్రాండ్ గా నిర్మించారు. మరి ఈ మూవీకి ఓటిటి ఆడియన్స్ నుండి ఎంతమేర స్పందన లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు