ఆ హిట్ కామెడీ థ్రిల్లర్ తమిళమంలో రీమేక్ కానుందట..?

ఆ హిట్ కామెడీ థ్రిల్లర్ తమిళమంలో రీమేక్ కానుందట..?

Published on Dec 8, 2019 6:08 PM IST

యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ బ్రోచేవారెవరురా. శ్రీవిష్ణు, నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్ కీలక పాత్రలు చేయడం జరిగింది. ఓ నూతన కాన్సెప్ట్ తో హిలేరియస్ గా నవించాడు దర్శకుడు వివేక్. శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి ల నటన సినిమాకే హై లెట్ గా నిలిచింది. విజయ్ కుమార్ మన్యం నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం అటు ప్రేక్షకులు ఇటు క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకుంది.

కాగా ఈచిత్ర తమిళ రీమేక్ హక్కులు ఓ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ దక్కించుకుందట. యూనివర్సల్ స్టోరీ కావడంతో బ్రోచేవారెవరురా మూవీని తమిళంలో రీమేక్ చేసే ఆలోచనలు మొదలుపెట్టారట. దీనితో ప్రీ ప్రొడక్షన్ పనులుకూడా మొదలుపెట్టారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు