రాజమండ్రిలో ‘తమిళ్ స్టార్’ ఫిల్మ్ !

రాజమండ్రిలో ‘తమిళ్ స్టార్’ ఫిల్మ్ !

Published on Jun 10, 2018 1:04 PM IST

తమిళంలో ‘అజిత్’ ఎంత పెద్ద స్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న హీరో ‘అజిత్’. ఆయన సినిమా వస్తుందంటే తమిళ థియేటర్స్ అన్నీ కళకళలాడిపోతాయి. జె. శివ కుమార్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వాసం’. ఈ చిత్రంలోని ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే తెరకెక్కించారు.

ఇప్పుడు ఈ చిత్రంలోని ముఖ్యమైన భారీ పోరాట సన్నివేశాలన్నీ ‘రాజమండ్రి’లోనే చిత్రీకరించబోతున్నారు. ముంబాయ్ లో కొంత భాగం షూట్ జరిపి తర్వాత ఈ చిత్ర యూనిట్ ‘రాజమండ్రి’కి చేరుకోనుంది. ఈ చిత్రంలో అజిత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అజిత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు