ఆర్ఆర్ఆర్ ఆసక్తి విషయాలు బయటపెట్టిన తమిళ రచయిత.

Published on Feb 23, 2020 3:01 am IST

ప్రముఖ తమిళ లిరికల్ మరియు స్టోరీ రైటర్ మదన్ కర్కి ఆర్ ఆర్ ఆర్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఆర్ ఆర్ ఆర్ తమిళంలో కూడా విడుదల అవుతున్న నేపథ్యంలో తమిళ డైలాగ్స్ మరియు లిరిక్స్ కి ఆయన పని చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ గురించి ఆయన మాట్లాడుతూ ప్రేక్షకుల ఊహకు మించిన భారీ తనం ఆర్ ఆర్ ఆర్ లో ఉందన్నారు. ఆర్ ఆర్ ఆర్ ఓ విజువల్ వండర్ లా ఉంటుంది అన్న ఆయన బాహుబలి కి మించిన అనుభూతి ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకులకు పంచుతుంది అన్నారు. ఇక తెరపై ఎన్టీఆర్, చరణ్ పాత్రలు అద్భుతంగా ఆవిష్కరిచబడతాయి అని మధు చెప్పుకొచ్చారు.

ఇటీవలే మొదలైన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అజయ్ దేవ్ గణ్ పాల్గొంటున్నారు. డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More