డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “తంగలాన్”

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “తంగలాన్”

Published on Jan 17, 2024 8:06 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా తంగలాన్. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈ నెలలో రిలీజ్ కావల్సి ఉండగా, వాయిదా పడింది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా కి సంబందించిన డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెట్ ఫ్లిక్స్ లో తమిళ, తెలుగు భాషలతో పాటుగా, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు