‘పెళ్లి సందడి’కి డైరెక్టర్ ఆయనేనా ?

Published on Nov 26, 2020 3:00 am IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన అనేక హిట్ సినిమాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ టైమ్ కేటాయించేస్తుంటారు. 1996లో వచ్చిన ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరోగా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ నందు మార్పులు చేసి ‘పెళ్లి సందD’ చేయనున్నారు రాఘవేంద్రరావుగారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ చేయనున్నాడు. అయితే ఈ చిత్రానికి రాఘవేంద్రరావుగారు పర్యవేక్షణ మాత్రమే చేస్తారట.

మరి దర్శకుడు ఎవరంటే సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి పేరు వినిపిస్తోంది. భరణి ఎంత మంచి నటుడో అంతకు మించి మంచి రచయిత. ఆయన పెన్ పవర్ చాలా సినిమాల్లో మ్యాజిక్ చేసింది. దర్శకుడిగా కూడ ఆయన ప్రతిభ గొప్పదే. ఆయన చేసిన ‘మిథునం’ చిత్రం గొప్ప ప్రసంశలు అందుకుంది. అటు సాంప్రదాయాన్ని, అనుబంధాల్లోని చిలిపితనాన్ని తూకం వేసినట్టు సమపాళ్లలో చూపగల సమర్థులు. అందుకే ఆయన చేత దర్శకత్వం చేయించాలని దర్శకేంద్రుడు భావిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More