
గంగ సినిమాలో మెరిసిన అందాల భామ తాప్సీ 62వ ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకకు డ్యాన్స్ రిహార్సెల్స్ చేస్తూ గాయానికి గురయ్యింది.
సమాచారం ప్రకారం పాటలో ఒక మూమెంట్ ట్రై చేస్తూ అందులో భాగంగా డ్యాన్సర్ భుజాలపైనుండి పట్టు తప్పి పడిపోయింది. హుటాహుటున ఆసుపత్రికి తరలించి, బెడ్ రెస్ట్ ని సూచించారు. తాప్సీ ప్రస్తుతం ‘రన్నింగ్ షాదీ డాట్ కమ్’ సినిమాలో నటిస్తుంది.

