ఆ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నటించనున్న తరుణ్ భాస్కర్ ?

ఆ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నటించనున్న తరుణ్ భాస్కర్ ?

Published on Apr 16, 2024 2:01 AM IST

ఇటీవల కీడా కోలా మూవీకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ దానితో యావరేజ్ విజయం అందుకున్నారు. ఇక ఆ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేసిన తరుణ్ మంచి పేరు అందుకున్నారు.

అయితే దాని అనంతరం ఆయన తెరకెక్కించిన మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ లేనప్పటికీ లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఇటీవల మలయాళంలో మంచి విజయం అందుకున్న జయ జయ జయ జయ హే మూవీ తెలుగు రీమేక్ లో తరుణ్ భాస్కర్ ఒక కీలక పాత్ర చేయనున్నారని అంటున్నారు.

అయితే ఈ మూవీ యొక్క డబ్బింగ్ వర్షన్ ఇప్పటికే ఓటిటిలో అందుబాటులో ఉంది. కాగా ఈ మూవీ రీమేక్, అలానే తరుణ్ భాస్కర్ అందులో నటిస్తుండడం పై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు