సెన్సార్ పూర్తి చేసుకున్న ‘టాక్సీవాలా’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘టాక్సీవాలా’ !

Published on Nov 8, 2018 8:58 PM IST

నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాబోయే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ చిత్రం ఫలితం విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా కీలకంగా మారింది. కానీ ఇటీవలే ‘నోటా’ చిత్రం రూపంలో ప్లాప్ ని ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ.. ఈ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చినా హిట్ అవుతుందని విజయ్ గతంలోనే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. మరి ఈ చిత్రం విజయ్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేస్తుందా.. లేక నోటా లాగే నిరాశ పరుస్తోందా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు