ఈ నెలలో రానంటున్న విజయ్ దేవరకొండ !

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రాల్లో ‘టాక్సీవాలా’ కూడ ఒకటి. నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ముందుగా మే 18న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇంకా కొన్ని చివరి దశ పనులు మిగిలిపోయి ఉండటంతో సినిమా మే 18న రావట్లేదని విజయ్ దేవరకొండ తెలిపారు.

జూన్ నెలలో విడుదల ఉంటుందని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు. మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్లు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్కెఎన్ నిర్మించారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి జాక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించగా సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ చేశారు.

Exit mobile version