విజయ్ దేవరకొండకి కీలకంగా మారిన ‘టాక్సీవాలా’ !

విజయ్ దేవరకొండకి కీలకంగా మారిన ‘టాక్సీవాలా’ !

Published on Oct 25, 2018 4:00 AM IST

Vijay Deverakonda

నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాబోయే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’ చిత్రం. అయితే, ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా నవంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వబోతుంది. ఇప్పుడు ఈ చిత్రం ఫలితం విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా కీలకంగా మారింది. ‘గీత గోవిందం’తో వంద కోట్ల క్లబ్ లోకి చేరి బడా స్టార్ హీరోల సరసన చేరిన విజయ్.. ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తేనే ఆ స్టార్ ఇమేజ్ నిలుస్తోంది.

కానీ ఇటీవలే ‘నోటా’ చిత్రం రూపంలో ప్లాప్ ని ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ.. ఈ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చినా హిట్ అవుతుందని విజయ్ గతంలోనే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. మరి ఈ చిత్రం విజయ్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేస్తుందా.. లేక నోటా లాగే నిరాశ పరుస్తోందా అనేది చూడాలి.

తాజా వార్తలు