ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘అఖిల్’..!

ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘అఖిల్’..!

Published on Sep 13, 2015 6:00 PM IST

akhil
‘అఖిల్’.. గత కొద్దికాలంగా టాలీవుడ్‌లో పాపులర్ అయిపోయిన పేరు. అక్కినేని తరం నుంచి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అక్కినేని అఖిల్, తన మొదటి సినిమా టైటిల్ కూడా ‘అఖిల్’ అనే పెట్టి రంగంలోకి దిగుతున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇక ఈమధ్యే రెండు పాటల చిత్రీకరణ కోసం సినిమా యూనిట్ ఆస్ట్రియా, స్పెయిన్ దేశాలకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఈ షెడ్యూల్‌లో పలు అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలను చిత్రీకిరించారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తైంది. మిగిలి ఉన్న ఒక్క పాటను మరికొన్ని రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఇక ఈనెల 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సినిమా ఆడియో రిలీజ్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాత నితిన్ ఈ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు