సైఫ్ సర్…గెట్ వెల్ సూన్ – దేవర టీమ్!

సైఫ్ సర్…గెట్ వెల్ సూన్ – దేవర టీమ్!

Published on Jan 23, 2024 2:32 PM IST


గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ను చాలా భారీ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

అయితే సైఫ్ అలీఖాన్ కి ట్రైసెప్ కి సంబందించిన శస్త్ర చికిత్స జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. సైఫ్ సర్ త్వరగా కోలుకోవాలని, సెట్స్ లో మీ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ టీమ్ తెలిపింది. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు