‘దేవర’ ప్రమోషన్స్ కోసం టీమ్ సూపర్ ప్లానింగ్ ?

‘దేవర’ ప్రమోషన్స్ కోసం టీమ్ సూపర్ ప్లానింగ్ ?

Published on Feb 15, 2024 11:43 PM IST

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

అయితే దేవర రిలీజ్ వాయిదా పడే అవకాశం కనపడుతోంది. దీని పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. విషయం ఏమిటంటే దేవర ప్రమోషన్స్ కోసం టీమ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. హీరో ఎన్టీఆర్ ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని ప్రమోట్ చేయడం కోసం అనేక ప్రాంతాల్లో పర్యటించనున్నారని, వీలైనంత ఎక్కువగా తమ మూవీని ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి చేరువ చేయాలనేది టీమ్ ఆలోచనట. ఇక రాబోయే రోజుల్లో దేవర కి సంబంధించి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు