
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్లో భారీ ఎత్తున ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తండ్రి మెగా స్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వరుస సినిమాలతో టాప్ లీగ్‌లో చెర్రీ చేస్తోన్న ఈ తొమ్మిదవ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించే పనిలో దర్శకుడు శ్రీనువైట్ల అండ్ టీమ్ చాలా కృషి చేస్తున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా భారీ ఎత్తున, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ స్టిల్స్, ఫస్ట్ టీజర్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ చూశాక సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఏ రేంజ్లో ఉన్నాయనేది స్పష్టమవుతూనే ఉంది. చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్, రిచ్క్లాస్ సినిమాటోగ్రఫీ, థమన్ బ్యాక్‌గ్రౌండ్ ఈ టీజర్‌కు స్పెషల్ హైలైట్స్‌గా నిలిచాయి. ఇక మేజర్ హైలైట్‌గా యాక్షన్ ఎపిసోడ్స్‌లో రామ్ చరణ్ ఈజ్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా “వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!” అంటూ చరణ్ చెప్పే డైలాగ్ అభిమానులకు పండగే అనడంలో అతిశయోక్తి లేదు.
భారీ బడ్జెట్‌తో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరు ఓ అతిథి పాత్ర చేయనుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ వారం టైటిల్ విషయమై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో శ్రీనువైట్ల సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు మళ్ళీ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

