టీజర్ తో రానున్న హిందీ ‘ప్రస్థానం’ !

టీజర్ తో రానున్న హిందీ ‘ప్రస్థానం’ !

Published on Jul 26, 2019 4:53 PM IST

దర్శకుడు దేవ కట్ట తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ‘ప్రస్థానం’ మంచి చిత్రంగా ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా జూలై 29 న ప్రస్థానం హిందీ రీమేక్ టీజర్ విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన శర్వానంద్, సాయి కుమార్ కెరియర్లలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు సంజయ్ దత్.

సంజయ్ దత్ ఇందులో నటించడమే కాకుండా స్వయంగా నిర్మిస్తున్నారు. హిందీలో కూడా చిత్రానికి ‘ప్రస్థానం’ అనే పేరునే పెట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇందులో సంజయ్ దత్ తో పాటు మనీషా కొయిరాల, జాకీ ష్రాఫ్, చుంకి పాండే, అలీ ఫజల్, అమైరా దస్తూర్, సత్యజిత్ దూబే కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు