ఈ ఏడాది ‘రంగుల రాట్నం’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ మరొక చిత్రం ‘రాజుగారు’ చిత్రీకరణను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబందించిన తాజా అప్డేట్స్ విషయానికి వస్తే ఈ చిత్ర టీజర్ ను ఉగాది సందర్బంగా మార్చి 18న రిలీజ్ చేయనున్నారు టీమ్. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో రాజ్ తరుణ్ కు జోడీగా అమైరా దస్తూర్ నటిస్తుండగా అనిల్ సుంకర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకురాలు సంజన రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.
