మరోసారి జోడీ కట్టనున్న ధరమ్ తేజ్, అనుపమ !
Published on May 18, 2018 11:27 am IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ లు ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తేజ్ ఐ లవ్ యు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్లో వీరిద్దరి జోడీకి మంచి రెస్పాన్స్ దక్కింది. జంట చూసేందుకు ఫ్రెష్ గా ఉన్నారని, ఆన్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందనే కాంప్లిమెంట్స్ కూడ అందాయి.

దీంతో దర్శకుడు కిశోర్ తిరుమల తేజ్ తో చేయాలనుకుంటున్న సినిమాలో కూడ అనుపమనే కథానాయకిగా తీసుకోవాలని అనుకుంటున్నారట. ధరమ్ తేజ్, అనుపమలు కూడ కిశోర్ కథ పట్ల, అందులో తమ పాత్రల పట్ల ఇంప్రెస్ అయి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేగాక ఈ చిత్రంలో ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిన్ కూడ నటించనుందని సమాచారం.

 
Like us on Facebook