తేజు కొత్త చిత్రం ఆ నెలలోనే ప్రారంభం కానుందట !

తేజు కొత్త చిత్రం ఆ నెలలోనే ప్రారంభం కానుందట !

Published on Aug 1, 2018 12:56 AM IST

sai dharam tej1

డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన లుక్ మార్చుకోవడానికి అమెరికా వెళ్ళాడు. ఇక ఆయన ఆగష్టు చివరి వారంలో ఫ్రెష్ లుక్ తో ఇండియా తిరిగిరానున్నాడట. కొంత విరామం తీసుకొని ‘నేను శైలజ’ ఫెమ్ కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈచిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో ప్రారంభం కానుందని సమాచారం.

ఇక ఈచిత్రంలో ప్రముఖ హాస్యనటుడు, హీరో సునీల్ ముఖ్య పాత్రలో నటించనున్నారని తెలుస్తుంది. ఈ చిత్ర టైటిల్ కి చిత్రలహరి.బార్ అండ్ రెస్టారెంట్ అనే ఉపశీర్షిక కలిగిన పేరును పరిశీలిస్తున్నారు. ఈచిత్రం విజయం సాధిచడం , సాయి ధరమ్ కు అలాగే కిశోర్ తిరుమలకు చాలా అవసరం. ఇక ఈ చిత్రం తరువాత తేజు ‘బలుపు’ ఫెమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంభినేషన్లలో ‘విన్నర్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు