తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన మొదలవ్వనుందని సమాచారం.
తేజా దర్శకత్వ శైలిలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం తెరకెక్కబోతుంది. మంచి భావోద్వేగ సన్నివేశాలతో పాటు వినోదాత్మకంగా ఉంటుందట. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో కొత్తగా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.


