ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు తేజ ఆ తరవాత రెండు పెద్ద సినిమాల్ని లైన్లో పెట్టారు. అవి కూడ సీనియర్ స్టార్ హీరోలతోనే. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమాలన్నీ ఆగిపోయాయి. ముందుగా వెంకటేష్ తో ‘ఆటా నాదే వేటా నాదే’ సినిమాను మొదలుపెట్టి వెంకీ ఫస్ట్ లుక్ ను కూడ రివీల్ చేసిన ఆయన దాన్ని పక్కనబెట్టి బాలయ్యతో ‘ఎన్టీఆర్ బయోపిక్’ స్టార్ట్ చేశారు.
కానీ కథకు న్యాయం చేయలేనంటూ ఆ సినిమా నుండి కూడ తప్పుకున్న తేజ మరొక సీనియర్ స్టార్ హీరో నాగార్జునతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే నాగార్జున ప్రస్తుతం వర్మతో ‘ఆఫీసర్’, యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్సకత్వంలో నానితో కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తున్నారు.


