“ఓం భీమ్ బుష్” పై తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

“ఓం భీమ్ బుష్” పై తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Apr 14, 2024 8:36 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ (Om Bheem bush) ఇటీవల థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. తాజాగా ఈ చిత్రం ను చూసిన టాలీవుడ్ యంగ్ హీరో, హను మాన్ (Hanu man) ఫేం నటుడు తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఓం భీమ్ బుష్ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నారు. శ్రీ విష్ణు స్లాంగ్, జోక్స్ బాగా అలరించాయి అని, బ్యాంగ్ బ్రోస్ ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్ ల పెర్ఫార్మెన్స్ హిలేరియస్ అంటూ చెప్పుకొచ్చారు.ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కి కంగ్రాట్స్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్, మనీష్ కుమార్ మరియు రచ్చ రవి లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు