మేము చాలా దూరం వచ్చాం…ప్రశాంత్ వర్మ కి తేజ సజ్జ బర్త్ డే విషెస్!

మేము చాలా దూరం వచ్చాం…ప్రశాంత్ వర్మ కి తేజ సజ్జ బర్త్ డే విషెస్!

Published on May 29, 2024 6:30 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హను మాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భం గా హీరో తేజ సజ్జ సోషల్ మీడియా వేదిక గా బర్త్ డే విషెస్ తెలుపుతూ, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కలలు కనడం నుండి, కలిసి ఆ కలలను చేజ్ చేయడం వరకూ చాలా దూరం వచ్చాం. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ ప్రశాంత్ వర్మ కి బర్త్ డే విషెస్ తెలిపారు. అంతేకాక ఒక ఫోటో ను షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తేజ సజ్జ తదుపరి మిరాయ్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రశాంత్ వర్మ జై హను మాన్ ప్రాజెక్ట్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు