“జై హనుమాన్” విషయంలో అపోహాలపై ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చిన తేజ సజ్జ

“జై హనుమాన్” విషయంలో అపోహాలపై ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చిన తేజ సజ్జ

Published on Apr 18, 2024 4:07 PM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న పలు అవైటెడ్ చిత్రాల్లో “జై హనుమాన్” (Jai Hanuman) కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) యంగ్ హీరో తేజ సజ్జ ల కాంబినేషన్ లో వచ్చిన మాసివ్ హిట్ చిత్రం “హను మాన్” కి ఇది సీక్వెల్ గా వస్తుండగా నిన్న రామ నవమి కానుకగా కూడా ప్రశాంత్ వర్మ అందరికీ పవర్ఫుల్ ప్రామిస్ అందించాడు.

అయితే జై హనుమాన్ విషయంలో చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది సూపర్ హీరో జానర్ నుంచి మైథలాజి సినిమాగా వెళ్ళిపోతుంది అన్నట్టుగా క్లైమాక్స్ తో అనిపించింది. లాస్ట్ లో హనుమాన్ ఎంట్రీతో పార్ట్ 2 అంతా హనుమంతుల వారే ఉంటారు అని చాలా మంది అనుకున్నారు. దీనితో తేజ పాత్ర ఉండకపోవచ్చనే అపోహలు వచ్చాయి.

అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ అందరికీ తేజ ఇచ్చేసాడు. జై హనుమాన్ లో ఖచ్చితంగా హనుమంతుల వారి పాత్ర ఉంటుంది అని అంతే కాకుండా తన హను మాన్ కూడా ఉంటాడు అని అందరికీ క్లారిటీ ఇచ్చాడు. అలాగే జై హనుమాన్ ఇంకా గ్రాండ్ గా ఉంటుంది ఇప్పుడే అన్ని విషయాలు చెప్పడం కరెక్ట్ కాదని సెలవిచ్చాడు. సో జై హనుమాన్ లో భజరంగ్ తో పాటుగా తను కూడా ఉంటాడు అని అందరికీ దీనితో ఓ క్లారిటీ వచ్చినట్టేగా..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు