“ఓజి” X “మిరాయ్”.. తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

“ఓజి” X “మిరాయ్”.. తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 18, 2024 1:56 PM IST


రానున్న రోజుల్లో మన తెలుగు సినిమా నుంచి పలు క్రేజీ ప్రాజెక్ట్ లు గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి అయితే రాబోతున్నాయి. మరి వీటిలో స్టార్ హీరోల సినిమాలతో పాటుగా యంగ్ హీరోస్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ చిత్రం “ఓజి” ఒకటి కాగా ఈ సినిమా విషయంలో లేటెస్ట్ గా యంగ్ హీరో తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

తాను తన లేటెస్ట్ సినిమా “మిరాయ్” లో ఒక సూపర్ యోధా గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ వచ్చిన సినిమా టైటిల్ గ్లింప్స్ తో తను అదరగొట్టేసాడు. మరి ఈ సూపర్ యోధా టైటిల్ ని అయితే మన టాలీవుడ్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇస్తానని చెప్పాడు. తాను “ఓజి” గ్లింప్స్ చూసినప్పుడు కళ్యాణ్ గారు ఆ కత్తి పట్టుకోవడం కానీ ఆ సినిమా ఫాంట్ మా సినిమా ఫాంట్ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి అని తన పాత్రకి ఆ పాత్రకి ఈ రకంగా కలవడంతో కళ్యాణ్ గారిని సూపర్ యోధా చెప్పొచ్చని తెలిపాడు.

అయితే తన మాటలు అక్షర సత్యం అనే చెప్పాలి. ఓజి గ్లింప్స్ చూసినా ఇప్పుడు మిరాయ్ గ్లింప్స్ చూసినా ఆ కఠాన హీరోస్ వారియర్ లుక్ కానీ వీడియోలో అక్షరాలు కూడా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. అయితే మెయిన్ ప్లాట్ మాత్రం రెండిటికీ చాలా తేడా ఉంది. మరి చూడాలి ఈ రెండు సినిమాలు ఎలాంటి సెన్సేషన్ సెట్ చేస్తాయి అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు