తేజ సజ్జ సరికొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో లాంఛ్ కి టైమ్ ఫిక్స్!

తేజ సజ్జ సరికొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో లాంఛ్ కి టైమ్ ఫిక్స్!

Published on Apr 17, 2024 3:07 PM IST


తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన హను మాన్ మూవీ ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉన్న టైమ్ లో హీరో తేజ సజ్జ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తన కొత్త సినిమా స్టార్ట్ కానుంది. ఈగల్ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు గ్లింప్స్ వీడియో లాంఛ్ ఈవెంట్ కి టైమ్ మరియు వేదిక ఫిక్స్ అయ్యింది.

రామా నాయుడు స్టూడియో, ఫిల్మ్ నగర్ లో రేపు ఉదయం 10:00 గంటలకి ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కి ఇది 36 వ చిత్రం. గౌర హరి సంగీతం అందించనున్న ఈ చిత్రం లో రితికా నాయక్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు