తేజ సజ్జ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్

తేజ సజ్జ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్

Published on Apr 17, 2024 8:00 PM IST

యువ నటుడు తేజ సజ్జ ఇటీవల ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హను మాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం ఆదుకున్నారు. పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన హను మాన్ తరువాత తేజ సజ్జ ఎవరితో మూవీ చేస్తారు అనే దానిపై అందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది.

ఇక లేటెస్ట్ గా ఈగిల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసారు తేజ. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈమూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయి అందరిని ఆకట్టుకోగా మూవీ యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని రేపు ఉదయం 11 గం. 7 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు.

ఈ మూవీలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించనుండగా మంచు మనోజ్, దుల్కర్ కీలక పాత్రలు చేయనున్నట్లు టాక్. కాగా ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు రేపటి గ్లింప్స్ లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు