తేజ హీరోగా కొత్త సినిమా మొదలుకానుంది

తేజ హీరోగా కొత్త సినిమా మొదలుకానుంది

Published on Jan 4, 2020 1:03 AM IST

teja

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘ఇంద్ర’ సినిమా చూసిన వాళ్లకు అందులో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ తప్పక గుర్తుండే ఉంటాడు. ఈ సినిమాతో పాటు ‘చూడాలని ఉంది, యువరాజు’ వంటి పలు సినిమాల్లో బాల నటుడిగా నటించిన తేజ ఈమధ్య వచ్చిన సమంత యొక్క ‘ఓ బేబీ’ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసి మంచి ఫీడ్ బ్యాక్ అందుకున్నాడు.

ప్రస్తుతం సోలో హీరోగా ఒక సినిమా చేస్తున్న ఈ కుర్రాడు రెండో సినిమాను కూడా స్టార్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. ఇందులో తేజ సరసన కొత్త నటి కథానాయకిగా నటించనుంది. ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు