తెలుగు భామ తేజస్వి ‘హార్ట్ ఎటాక్’, ‘మనం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలలో సైడ్ క్యారక్టర్ లు చేస్తూ వచ్చింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ సినిమాతో సోలో హీరోయిన్ గా తెరకు పరిచయంకానుంది. ఈమె నటించిన మరికొన్ని సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకానుంది
రామూ గురించి తేజస్వి మాట్లాడుతూ “రామూ ఒక లివింగ్ ఎన్ సైక్లోపీడియా. నా చేత అసలు మేక్ అప్ వేయనివ్వలేదు. ఈ సినిమాలో న్యాచురల్. ఒక మనిషి నుండి తన బెస్ట్ ని తీసుకురాగల సత్తా ఆయనకు వుంది. షూటింగ్ ల మధ్య విరామం తీసుకోరు” అని తెలిపింది
ఒక సినిమా విడుదలకాకుండానే ఈ భామ చేతిలో మరో నాలుగు చిత్రాలు వున్నాయి. మారుతి లవర్స్ సినిమాలో కూడా ఈ భామే హీరోయిన్. మరి తేజస్వికి విజయం అందాలని కోరుకుందాం


