తేజస్వి తన పారితోషికం గురించి చెప్పింది కానీ.. !

తేజస్వి తన పారితోషికం గురించి చెప్పింది కానీ.. !

Published on Jun 14, 2018 6:46 PM IST

బిగ్ బాస్ 2 లో పాల్గొంటున్న కంటిస్టెంట్స్ ల పారితోషికాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే పార్టిసిపేట్ తేజస్వి బిగ్ బాస్ హౌస్ లో కెమెరా ఉందన్న విషయం మర్చిపోయి తన వక్తిగత సమాచారాన్ని సహచరులతో పంచుకుంది . సినిమాల్లో నటించినందుకు గాను రోజుకు 12 వేల రూపాయలను తీసుకునేదాన్ని .తరువాత డబ్బుల కోసం జాబ్ చేయవలసి వచ్చింది. అయితే జాబ్ చేసుకుంటూ సినిమాల్లో ట్రై చేయడం కుదరదు అందుకే జాబ్ మానేసాను.

తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ 2 లో చేసే అవకాశం వచ్చింది ఈ షో కి రోజు కు ఇంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అని తేజస్వి వెల్లడించింది. తను బిగ్ బాస్ 2 రెమ్యూనరేషన్ గురించి చెప్పిన మాటలను ఎడిటింగ్ లో బీప్ చేసి ప్రసారం చేశారు షో నిర్వాహకులు. బీప్ చేయకుండా ఉండి ఉంటే తేజస్వి ఈషో కి ఎంత తీసుకుంటుందో ప్రేక్షకులకు తెలిసేది.

ఇక ఈ సెకండ్ సీజన్లో పాల్గొంటున్నకంటిస్టెంట్స్ ఫై మొదట్లో పెదవి విరిచిన ప్రేక్షకులు ఇప్పుడు మెల్లిగా వారికి అలవాటు పడుతున్నారు . ప్రధానంగా బాబు గోగినేని , తేజస్వి , సంజనలు ఈ షో ఫై ఆసక్తి పెంచేలా రాణిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సెకండ్ సీజన్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు