టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘విరోష్’ అంటూ సాగిన వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగగా, హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఇక ఈ స్టార్ జంటకు టాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా తమ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, తాజాగా ఈ జంటను ఆశీర్వదించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారి గృహానికి ప్రత్యేకంగా వెళ్లారు. విజయ్-రష్మిక వివాహబంధంలోకి అడుగుపెట్టినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్టార్ జంటకు ఎర్రగులాబీల బొకేను అందించి రేవంత్ విష్ చేశారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ విజయ్ సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. తమను విష్ చేసేందుకు సమయం కేటాయించి, తమ ఇంటికి వచ్చిన తెలంగాణ సీఎంకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నట్లు విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Heartfully touched that the Hon’ble Chief Minister of Telangana, Shri. @revanth_anumula garu, took the time to visit our home this evening and bless us on our wedding. Grateful for the love and affection he always shares 🙏 pic.twitter.com/QAbp9127ad
— Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2026
