డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటున్న డిస్ట్రిబ్యూటర్లు

డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటున్న డిస్ట్రిబ్యూటర్లు

Published on Mar 3, 2021 10:01 PM IST


సుమారు 9 నెలల పాటు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కున్న సినీ రంగం ఇప్పుడిప్పుడే కొలుకుంటోంది. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఇన్నాళ్లు వాటిల్లిన నష్టాల నుండి కోలుకునే వెసులుబాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న అన్ని జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు పలు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అంటున్నారు.

రద్దు చేసిన పార్కింగ్ ఫీజును తిరిగి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని అదే ఎగ్జిబిటర్ల ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యే ఏకైక మార్గమని, నామినల్ పార్కింగ్ ఫీజు వసూలు చేసే హక్కులు ఇవ్వాలని అంటున్నారు. కోవిడ్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్ల కరెంట్ చార్జీలు మాఫీ చేయాలని, టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి, మరియు అదనంగా షో లు ప్రదర్శించేందుకు డిసెంబర్లో ఇచ్చిన జీవోను వెంటనే అమలులోకి తేవాలని కోరుతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ విజయేందర్ రెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మురళి మోహన్ పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు