‘శ్రీ‌కారం’ లాంటి మంచి సినిమాల‌కి అండ‌గా నిలుస్తాం – తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్

‘శ్రీ‌కారం’ లాంటి మంచి సినిమాల‌కి అండ‌గా నిలుస్తాం – తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్

Published on Mar 10, 2021 12:06 AM IST

sreekaram ktr
ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో 14రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాకు రామ్ఆచంట, గోపీఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం హై ఎక్స్ పెక్టేషన్స్‌తో మహా శివరాత్రి సందర్బంగా మార్చి 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు హ‌రీష్ శంక‌ర్‌, ప‌ర‌శురాం, ప్ర‌ముఖ నిర్మాత‌ అనిల్ సుంకర, హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, నార్ల శ్రీనివాస్ రెడ్డి, రైటర్ సాయి మాధవ్ బుర్రా, డీఓపీ యువరాజ్, పాటల రచయిత భరద్వాజ తదిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతూ శ్రీకారం టీజర్ చూశానని, ఆ తరువాత 9 నిమిషాల వీడియో చూశాను. హృద‌యంతో ఈ సినిమాను నిర్మించారని అన్నారు. అయితే దర్శకుడు కిషోర్ ఎంత సింపుల్‌గా కనిపిస్తున్నాడో శర్వానంద్ కూడా అంతే సింపుల్‌గా ఉన్నారని, ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు! అని అంటారు. వ్యవసాయంలోనే వ్యయం ఉంది సాయం ఉంది. ఇప్పుడు వ్యయం పెరిగింది.. సాయం తగ్గింది.. రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదని అన్నారు. అయితే ఈ సినిమా టీజర్ చూస్తేనే బాగా తీశారని తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. అంతేకాదు రావు రమేష్ గారికి నేను అభిమానినని, ఆయన తండ్రి రావు గోపాల్ రావు గారంటే కూడా తనకు ఎంతో అభిమానమని అన్నారు. ఇదిలా ఉంటే శర్వానంద్ డిఫరెంట్ సినిమాలను చేస్తూ వస్తున్నారని, మంచి ప్రయత్నాలు, మంచి సినిమాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అండగా ఉంటాం. హ‌రీష్ చెప్పిన‌ట్టు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు నా వంతుగా ప్రయత్నిస్తానని, మంచి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరించాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమా పాటల రచయిత భరద్వాజ మాట్లాడుతూ శ్రీకారం సినిమాలో సంక్రాంతి పాట, రెండు బిట్ సాంగ్స్‌ను రాశానని అన్నారు. అయితే అద్భుతమైన సందర్భం క్రియేట్ చేసిన దర్శకుడు, మంచి ట్యూన్స్ ఇచ్చిన మిక్కీ జే మేయర్, మనసును హత్తుకునేలా పాడిన సింగర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, మార్చి 11న మా సినిమాను చూస్తే మీ సొంతూరును చూసినట్టు ఉంటుందని అన్నారు. అంతేకాదు మా సినిమా టికెట్‌తో పాటు మీ ఊరికి కూడా టికెట్‌ను బుక్ చేసుకోండి అని అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత‌ అనిల్ సుంకర మాట్లాడుతూ తెలుగు చిత్ర సీమలో చాలా మంది నిర్మాతలు ఉన్నారని, ఇంత ప్యాషన్ ఉన్న వాళ్లు మాత్రం రామ్ అండ్ గోపీలే అని అన్నారు. ఓ పది కోట్లు, మంచి స్క్రిప్ట్ రెండూ పక్కన పెడితే రెండింట్లో మంచి స్క్రిప్ట్‌నే ఎంచుకుంటారని, పది కోట్లు కావాలంటే తరువాత సంపాదించుకుంటామని వెళ్లు అంటారు. అలాంటి గొప్ప నిర్మాతలకు మరో విజయవంతమైన సినిమాకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ఇదో గొప్ప చిత్రంగా నిలుస్తుందని, డాక్టర్ కొడుకు డాక్టర్.. ఇంజనీర్ కొడుకు ఇంజనీర్.. అవ్వాలని అనుకుంటారు. కానీ రైతు కొడుకు రైతు అవ్వాలని అనుకున్నప్పుడే ఈ సినిమాకు నిజమైన నివాళి అని, రైతు పండించే ధాన్యం తినే ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది అని అన్నారు.

దర్శకుడు కిషోర్‌.బి మాట్లాడుతూ ఈ కథను సినిమా తీసేందుకు ఎంతో మంది స్ఫూర్తినిచ్చారని, ఈ సినిమా గురించి నేను చెప్పడం కంటే మీరు చూసిన తరువాత మాట్లాడిన మాటలే కరెక్ట్‌గా ఉంటాయని, మార్చి 11న ఈ సినిమాను చూడండి. చూసిన తరువాత సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోస్ట్ వేయండని నచ్చితే వేయండి, న చ్చకపోయినా వేయండి అని అన్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ డైనమిక్ లీడర్ సోసైటీలో, సోషల్ మీడియాలో క్షణాల్లో స్పందిస్తూ ఉండే కేటీఆర్ అన్నకు స్వాగతమని, మీరెప్పుడూ కూడా మా ఇండస్ట్రీకి అండగా ఉన్నారు. శ్రీకారం సినిమా చూశాను వర్షం పడేటప్పుడు వచ్చే మట్టివాసనలా ఈ సినిమా ఉంటుందని, యాక్టర్, డాక్టర్ అవ్వాలని ఎంతో మంది అనుకుంటారు కానీ ఎందుకు రైతు అవ్వాలని అనుకోవడం లేదని నేరుగా ప్రశ్నించే సినిమా ఇది అని, చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది అని అందుకే ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ గారిని ఓ రిక్వెస్ట్ చేస్తున్నానని, ఈ సినిమాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పరుశురాం కూడా మాట్లాడుతూ మంచి సినిమాను ఆశీర్వదించేందుకు వచ్చిన మంత్రివర్యులు కేటీఆర్ గారికి థ్యాంక్స్ అంటూ నేను ఈ సినిమాను చూశాను. కొన్ని చోట్ల తెలీకుండా కన్నీళ్లు వచ్చాయని దర్శకుడు కిషోర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చారు.

సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ నేను దాదాపుగా 250 సినిమాలు చేశానని, 40 ఎకరాల భూమిని తీసుకుని పంటలు పండించి సినిమాను తీసిన నిర్మాతలు ఈ ప్రపంచంలోనే లేరు ఇది వరల్డ్ రికార్డ్ అని అన్నారు. మరో నటుడు రావు రమేష్ మాట్లాడుతూ నాకు పర్సనల్‌గా ఈ సినిమా చాలా స్పెషల్ అని గమ్యంలో శర్వానంద్‌తో కలిసి పని చేశాను మళ్లీ 12 ఏళ్ల తరువాత ఇప్పుడు ఈ సినిమాలో కలిసి పని చేశానని అన్నారు. ఈ సినిమాను దర్శకుడు మట్టి మనిషిలా తీశారని ఆయనకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలని, ఇక సినిమా కోసం 40, 50 ఎకరాలు పండించి మరీ సినిమాను తీసిన నిర్మాతలకు కూడాథ్యాంక్స్ అని అన్నారు.

చిత్ర నిర్మాత‌ గోపీ ఆచంట మాట్లాడుతూ శ్రీకారం ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి కేటీఆర్ గారికి థ్యాంక్స్ అని చెప్పుకొచ్చారు. ముందుగా ఈ చిత్రానికి పని చేసిన అందరికీ థ్యాంక్స్ అని, హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడుకున్న చిత్రం ఇది అంటూ మన చుట్టూ జరిగే, తిరిగే క్యారెక్టర్, వాతావరణమే ఇందులో కనిపిస్తుందని మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాం. మార్చి 11న మా సినిమాను తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలని కోరారు.

ఇక డీఓపీ యువరాజ్ మాట్లాడుతూ ఈ సినిమాను కొత్త దర్శకుడు తీసిన సినిమాలా అనిపించలేదని చెప్పుకురాగా, నార్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మనదేశంలో 70 శాతం మందికి జీవనాధారం వ్యవసాయం.. రైతు, వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తాం.. తగిన గుర్తింపు.. ఇవ్వాలనే మంచి సబ్జెక్ట్‌తో శ్రీకారం సినిమాను తీశారని, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చిత్ర యూనిట్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పారు.

ఇక ఫైనల్‌గా హీరో శర్వానంద్ మాట్లాడుతూ మా టీంను ఆశీర్వదించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ అని, ఈ చిత్రంలో యూత్‌ తలుచుకుంటే ఏం చేయగలరో చూపించాం. కేటీఆర్ ఓ యూత్ ఐకాన్ అని అన్నారు. ఈ సినిమా కథ వినడానికి ఆరు నెలలు ఎదురుచూసేలా చేశానని, బిజీగా ఉండటం వలన వినలేకపోయాను. కానీ పట్టుబట్టి మరీ వినిపించి ఒప్పించారు. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్ అని అన్నారు. అయితే ఈ కథ విన్నప్పుడే ఈ సినిమా చేయడం నా బాధ్యత అని అనుకున్నానని, ఈ సినిమాను మీ అందరూ చూడాలి.. అది మీ బాధ్యత అని శ్రీకారం లాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదని అలాంటి సినిమా ఇచ్చినందుకు చిత్ర యూనిట్ అందరికి మరోసారి థ్యాంక్స్ అంటూ జై జవాన్ జై కిసాన్.. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు