తెలంగాణలో ఆ నటుడికి గుడికట్టి పూజలు చేస్తున్నారు

Published on Dec 21, 2020 11:00 pm IST

సోనూ సూద్.. ఈ పేరు ఇప్పుడు దేశం మొత్తం తెలుసు. ఇంతకుముందు సోనూ సూద్ అంటే వెండి తెర మీద ఆయన చేసిన ప్రతినాయకుడి పాత్రలే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం సోనూ సూద్ అంటే సేవా కార్యక్రమాలే గుర్తొస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు ఆయన చేసిన సహాయం సామాన్యమైనది కాదు. పొరుగు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి, సొంత ఊళ్లకు వెళ్లలేక, పనులు లేక అనేక అవస్థలు పడుతున్న వందల మంది కూలీలను సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చారు. వేళా మందికి భోజన వసతులు, పేద విద్యార్థులకు సౌకర్యాలు, వైద్య, అందించడం, జీవనోపాధి కల్పించడం లాంటి పనులు అనేకం చేశారు.

ఆ పనులు చేయడానికి ఆయన కోట్ల రూపాయలు వెచ్చించారు. ఆ డబ్బును ముంబైలోని తన ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. ఈ సంగతి తెలియడంతో ఆయన పట్ల జనంలో గౌరవం మరింత పెరిగింది. దీంతో సోనూ రియల్ హీరో మాత్రమే కాదు దేవుడు అంటూ కొనియాడుతున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకు గుడి కట్టారు జనం. తాజాగా తెలంగాణలోకి సిద్ధిపేట జిల్లా దుబ్బ తండాలో అక్కడి గిరిజనులు సోనూ సూద్ విగ్రహం పెట్టి గుడి కట్టారు. ఆడినవారికి కాదనాకుండా సహాయం చేస్తున్న సోనూ సూద్ తమకు దేవుడిలాంటి వారని అంటున్నారు అక్కడి జనం. ఇక సోనూ సూద్ అయితే ఇప్పటికీ సహాయం కోసం తనను సంప్రదించివారికి చేతనైనంత చేస్తూనే ఉన్నారు.

సంబంధిత సమాచారం :