ప్రముఖ నటి విలన్ ‘తెలంగాణా’ శకుంతల ఈ రోజు తెల్లవారు జామున హైదరాబాద్ లో చనిపోయారు. ఈ భాదాకరమైన వార్త తెలుగు చిత్రసీమని దిగ్బ్రాంతికి గురిచేసింది.
63 సంవత్సరాల ‘తెలంగాణా’ శకుంతల కి కొంపల్లిలోని ఆమె ఇంటిలో హార్ట్ఎటాక్ వచ్చిన వెంటనే హుటాహుటిన నారాయణ హృదయ హాస్పిటల్ కి తరలించినప్పటికి అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు దృవీకరించారు.
ఆమె బౌతికకాయాన్ని 10 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకువెల్లనున్నారు. అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరుపుతారు.
1981లో విడుదల అయిన ‘మహాభూమి’ చిత్రం ద్వారా పరిచయం అయిన శకుంతల ‘నువ్వు నేను’ ‘లక్ష్మీ’ ‘ఒక్కడు’ చిత్రాలలో చేసిన పాత్రలతో మంచి గుర్తింపు పొందారు. తెలంగాణా యాస తో ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నారు. ఆవిడ చివరిగా నటించిన చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’
‘తెలంగాణా’ శకుంతల లోటు చాలా భాదాకరం. 123తెలుగు తరపున ఆవిడ కుటుంబ సభ్యులకి ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నాం.


