లేటెస్ట్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రమే ‘టాక్సిక్’. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం రిలీజ్ కి ముందు, రిలీజ్ రోజు కూడా షాకింగ్ బుకింగ్స్ ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
కానీ డే 2 ఉదయం బుకింగ్స్ విషయానికి వస్తే మాత్రం మరో షాక్ అని చెప్పాలి. ఒకరోజు విడుదల గ్యాప్ లో ఉన్న టాక్సిక్, గత వారం విడుదల అయ్యిన ‘ఇరుముడి’ బుకింగ్స్ దాదాపు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల గ్యాప్ లో బుక్ మై షోలో సేమ్ స్పీడ్ తో బుకింగ్స్ కనిపించడం విశేషం.
దీనితో ఇరుముడి చిత్రం ఆదరణ ఏ లెవెల్లో కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఇరుముడి రీజనల్, టాక్సిక్ పాన్ ఇండియా సినిమా ఆయే.. ఇప్పుడు కూడా ఇరుముడి ఇంత స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తుందంటే ఇప్పట్లో ఆగే సంచలనం కాదని చెప్పొచ్చు.


