ఈ ‘సైకో’ను ఎవరు కొనబోతున్నారో

Published on Jan 26, 2020 3:24 pm IST

గత శుక్రవారం తమిళ పరిశ్రమలో విడుదలైన చిత్రం ‘సైకో’ సూపర్బ్ టాక్ తెచ్చుకుంది. మిస్కిన్ డైరెక్షన్లో రూపొందిన ఈ థ్రిల్లర్ సినిమాపై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి తగ్గట్టే టాక్ కూడా ఉంది. మిస్కిన్ గత చిత్రాలు ‘డిటెక్టివ్, పిశాచి’ చిత్రాలు తెలుగులో డబ్ కాబడి అలరించడంతో ఈ ‘సైకో’ సినిమాను కూడా తెలుగులోకి డబ్ చేస్తారని అనుకున్నారు చాలామంది. కానీ సినిమా డబ్ కాలేదు.

పైగా హిట్ టాక్ తెచ్చుకుంది. తమ సినిమాను గర్భిణులు, వయసు పైబడినవాళ్ళు చూడవద్దని చిత్ర బృందం ప్రికాషన్స్ కూడా ఇస్తోంది. అసలే థ్రిల్లర్ చిత్రాల్ని అమితంగా ఇష్టపడే మనవాళ్ళకి ఈ సంగతులన్నీ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీంతో ఎవరైనా దీని అనువాద హక్కులు కొని డబ్ చేస్తేనో లేకపోతే ‘రాక్షసుడు’ సినిమా తరహాలో రీమేక్ చేస్తేనో బాగుంటుందని అనుకుంటున్నారు. మరి చిత్రం మనకు ఏ రూపంలో అందుబాటులోకి వస్తుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్, అదితీరావ్ హైదరి, నిత్యామీనన్ ప్రధాన పాత్రదారులుగా నటించారు.

సంబంధిత సమాచారం :

X
More