బిగ్ బాస్ 3 విజేతగా రాహుల్‌ !

బిగ్ బాస్ 3 విజేతగా రాహుల్‌ !

Published on Nov 4, 2019 12:01 AM IST

తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న షో ‘బిగ్ బాస్’. అక్కినేని నాగార్జున హోస్ట్ గా మొదలైన ఈ సీజన్ 3 లో మొత్తం 17 కంటెస్టెంట్స్ మధ్య పోటీ పడగా.. మొత్తానికి హోరా హోరీగా సాగి ఆ 17 మందిలో విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. ఫైనల్‌ లో రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీలు ఉన్నా.. ప్రధానంగా శ్రీముఖి, రాహుల్‌ ల మధ్యనే పోటీ నడిచింది.

అయితే అనూహ్యంగా చివర్లో శ్రీముఖికి గట్టి షాక్ ఇచ్చి.. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ నిలిచాడు. శ్రీముఖి రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది. మొత్తానికి బుల్లితెర‌ పై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న ఈ రియాలిటీ షో ఇంకా ఎన్ని సీజన్స్ నడుస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు